ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. మోడీతో సుమారు గంట పాటు భేటీ అయ్యారు సీఎం జగన్. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులతో పాటు పోలవరం ప్రాజెక్టు, పెండింగ్ బకాయిలపై చర్చించారు. అలాగే విభజన అంశంతో పాటు రాజధాని అంశం, పోలవరానికి రావలసిన నిధులు, 9,10 షెడ్యూల్లోని సంస్థల విభజన అంశాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు సీఎం జగన్.
8 ఏళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య విభజన హామీల సమస్య అలాగే ఉందని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అనంతరం కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఇక నేటి రాత్రికి అమిత్ షా తో భేటీ కానున్నారు సీఎం జగన్.