ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు రాజకీయ సమీకరణాలను మారుస్తున్నాయి. రాజకీయంగా ఇప్పుడు కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇద్దరు మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ కేబినేట్ నుంచి తప్పుకుని రాజ్యసభకు వెళ్తున్నారు. దీనితో మంత్రి వర్గంలోకి ఆర్కే రోజా రావడం ఖాయంగా కనపడుతుంది.
ఈ నేపధ్యంలోనే దేవినేని అవినాష్ కి కీలక పదవి రెడీ చేసినట్టు సమాచారం. అవినాష్ ఇప్పుడు ఏ పదవి లేకుండా ఉన్నారు. ఆయనకు జగన్ విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు జగన్. ఆ పదవికి అంత ప్రాధాన్యత లేని సంగతి తెలిసిందే. ఇప్పుడు రోజాకు ఉన్న నామినేటెడ్ పదవిని జగన్ అవినాష్ కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అవినాష్ పార్టీ కోసం కష్టపడుతున్నారు.
దానికి తోడు బలమైన వర్గం కూడా ఉంది ఆయనకు. దీనితో జగన్ ఆ పదవిని అవినాష్ కి ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఇప్పటికే అవినాష్ కి హామీ కూడా వచ్చినట్టు సమాచారం. రోజా మంత్రి వర్గం లోకి వెళ్తే మాత్రం అవినాష్ కి ఆ పదవి ఖాయమని అంటున్నారు. దీనిపై ఇప్పుడు దేవినేని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం నిజాయితీ గా కష్టపడే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని జగన్ నిరూపించారని అంటున్నారు.