ఏపీలో 3700 మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు ఎస్‌ఐపీబీ ఆమోదం

-

సీఎం జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ. అదానీ గ్రీన్‌ ఎనర్జీ చేపట్టనున్న 3700 మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. మొత్తంగా రూ.15,376 కోట్ల పెట్టుబడి పెడుతుండగా.. మొత్తం నాలుగు దశల్లో ప్రాజెక్టు పూర్తి కానుంది. సుమారు 4 వేల మందికి ఉపాధికి అవకాశం కలుగనుంది. దావోస్‌ వేదికగా చేసుకున్న అవగాహన ఒప్పందాల్లోని ప్రాజెక్టు ఇది. వైయస్సార్‌ జిల్లాలో వేయి మెగావాట్లు, పార్వతీపురం మన్యం జిల్లా కురుకుట్టి వద్ద 1200 మెగావాట్లు, కర్రివలస వద్ద వేయి మెగావాట్లు, సత్యసాయి జిల్లాలోని పెద్దకోట్ల చిత్రవతి వద్ద 500 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి జరుగుతుంది.

వైయస్సార్‌ జిల్లా పులివెందులలో పంక్చుయేట్‌ వరల్డ్‌ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.50 కోట్లతో పెట్టనున్న గార్మెంట్స్‌ తయారీ పరిశ్రమకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇదే కంపెనీ వైయస్సార్‌ జిల్లాలోని కొప్పర్తిలో రూ.50 కోట్లతో పెట్టనున్న మరో యూనిట్‌కూ ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ రెండు యూనిట్ల ద్వారా మొత్తంగా 4200 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. కృష్ణాజిల్లా మల్లవెల్లి ఫుడ్‌పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ రొయ్యల ప్రాససింగ్‌ పరిశ్రమకు ఆమోదం తెలిపింది ఎస్‌ఐపీబీ.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version