ఏపీలో అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలని సీఎం జగన్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తున్న శాఖలపై సమీ క్ష నిర్వహించారు సీఎం జగన్. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గనులు, అటవీ పర్యావరణశాఖ అధికారులతో సమావేశమయ్యారు సీఎం జగన్. పన్నుల వసూలులో పారదర్శకత పెంచి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా ఆదాయాలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి రాబడులు ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జగన్. తప్పుడు బిల్లులు లేకుండా, పన్ను ఎగవేతలకు ఆస్కారం లేకుండా మంచి విధానాలను రూపొందించుకోవాలన్నారు సీఎం జగన్.
అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలని, బెల్టు షాపులు, గ్రామాల్లో అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులు కీలకపాత్ర వహిస్తున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు సీఎం జగన్. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీఓ, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత ఫోకస్ పెట్టాలని సీఎం జగన్ సూచించారు. 14400 ఏసీబీ నెంబరుతో పోస్టర్లు ఏర్పాటు చేయాలని, ఫోన్ కాలను రిసీవ్ చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్టుపై కూడా పక్కాగా ఉండాలన్నారు సీఎం జగన్.