ఆ దేవాలయంలో సైన్స్ కు అందని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి..

-

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో దేవలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రముఖ పుణ్య క్షేత్రాలు ఎక్కువగా ఉన్నాయి.వాటిలో కేవలం నవ నరసింహాలయా ఎంతో ప్రత్యేకత. ఆ నవ నరసింహాలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం..ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయం.ఎంతో మహిమ, విశిష్టత కల్గిన ఆ ఆలయంలో స్వామి వారు శ్రీ ఖాద్రి నరసింహునిగా పూజలందుకుంటున్నారు. కాటమ రాయుడా కదిరి నరసింహుడా అంటూ నిత్యం పూలందుకుంటున్న ఆ మహిమాన్విత క్షేత్రం చూడాలంటే.. అనంతపురం జిల్లాకు వెళ్లాల్సిందే. అసలు కదిరి నరసింహునికి ఖాద్రి నరసింహునిగా పేరేందుకు వచ్చింది.. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి తరువాత అంత ప్రాముఖ్యత కలిగిన ఆ క్షేత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ లో స్వయంభుగా వెలసిన దేవలయాలలో శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహాస్వామి క్షేత్రం కూడా ఒకటి. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వెలసిన ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుడుని వదించిన తర్వత.. ఆగ్రహంతో స్వామి అలానే సంచరించడం చూసిన దేవాదిదేవతలు, ప్రహ్లాదున్ని స్వామిని శాంతపరచడం నివల్లే అవుతుందని చెప్తారు. అప్పుడు ప్రహ్లాదుడు ఈ ఖాద్రి ప్రదేశంలో స్వామిని శాంతపరచడంకోసం ప్రార్థనలు చేసాడు. అందుకు నిదర్శనంగా ఇక్కడ స్వామి వారి ప్రహ్లాదుని సమేతంగా ఉంటారు. స్వామిని పూజిస్తున్నట్టు ప్రహ్లాదుడు స్వామికి ఎడమవైపు ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం మరియు స్వామిని పూజిస్తున్నట్టు ఉన్న ప్రహ్లదుని విగ్రహం ఖాద్రి వృక్షం క్రింద కొలువై ఉంటాయి. 10వ శతాబ్దంలో పట్నం పాలగాడు అయిన రంగనాయకుల స్వామి వారి ఆదేశం మేరకు ఇక్కడ ఆలయం నిర్మించారని అక్కడి చరిత్ర కారులు చెబుతుంటారు.

ఇక్కడ సైన్స్ కు అందని రహస్యం ఒకటి ఉంది. అదేంటంటే..మూలవిరాట్టుకు అభిషేకం చేసిన తర్వాత విగ్రహం నాభి నుంచి వచ్చే స్వేదాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. అయితే ఆ స్వేదం ఎలా వస్తుందన్నది నేటికీ ఎవరూ చెప్పలేని పరిస్థితి. నేటికీ స్వామి వారు ఇక్కడ నిజరూపంలో ఉన్నారని చెప్పేందుకు ఇది ఒక సాక్షంగా భక్తులు నమ్ముతారు. అసలు కదిరి నరసింహా స్వామిని కాటమరాయునిగా ఎందుకు పిలుస్తారు.. అలాగే శ్రీ ఖాద్రి నరసింహునిగా ఎందుకు పిలుస్తారో ఇప్పుడు చుద్దాము..
స్వామి వెలసిన ప్రాంతం చాలా విశేషమైనది..ఒక కొయ్య స్తంభం నుంచి ఉద్భవించినట్లు ప్రజలు చెబుతున్నారు. కదిరిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు రెండు ఉన్నాయి. ఒకటి కదిరి పట్టణంలో ఉంటే మరొకటి కదిరి కొండమీద ఉంది. స్వామి వారికి అభిషేకం చేసిన తర్వాత నాభి నుండి వచ్చే నీటినే ఇక్కడి భక్తులు తీర్ధంగా తీసుకుంటారు. కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకోగానే మనకు మొదటగా గాలిగోపురం కనపడుతుంది. హరిహర రాయ, బుక్కరాయ, శ్రీకృష్ణ దేవరాయలు దశల వారిగా 13-15 శతాబ్దల మధ్య కాలల్లో నిర్మించారు. గాలిగోపురం దాటుకుని లోపలికి వెళ్లిన భక్తులకు కళ్యాణకట్ట కనిపిస్తుంది. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన భక్తులకు స్నానం చేయడానికి దగ్గరలో బురుగుతీర్థం దర్శనమిస్తుంది..ఆ ఆలయంలో ఇంకా ఎన్నో ఆలయాలు ఉన్నాయి.

ఈ ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయి..ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో బ్రహ్మోత్సవలు చాలా వైభవంగా జరుగుతాయి. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల తర్వాత అంత ప్రముఖంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉంటాయి. కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి రథోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ఈ రథోత్సం దేశంలో పూరి జగన్నాథ రథోత్సవం తరువాత అత్యంత పెద్దదిగా చెబుతారు. లక్షలాది మంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొంటారు. రథోత్సవం జరిగే సమయంలో రథం మీదకి భక్తులు మిరియాలు మరియు పండ్లు చల్లుతారు. వాటిని భక్తులు మహాప్రసాదంగా తీసుకుంటారు. కుల మతలకు అతీతంగా పూజలు జరిగే దేవాలయంగా ప్రసిద్ధి గాంచిన దేవాలయం కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం..ఇక్కడ మతాలతో భేదం లేకుండా ప్రతి ఒక్కరూ స్వామి వారిని దర్షించుకుంటారు.

ఈ ఆలయానికి ఎలా చేరుకొవాలి..

శ్రీ కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోవాలంటే..హైదరాబాద్ పట్టణానికి 454కి.మీ మరియు అనంతపురంకి సుమారు 100కి.మీ దూరంలో ఉంది. రైలు, బస్సు సౌకర్యం కూడా పలు ప్రాంతాల నుంచి ఉంది. అంతే తిరుపతికి దాదాపు 180 కి.మీ.ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version