ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. పంటలు బాగా పండాలని రైతులు అందరు ఆనందం వ్యక్తం చేస్తున్న తరుణంలోనే కురిసిన భారీ వర్షాలతో చేతికొచ్చిన పంట పూర్తిగా దగ్ధమై రైతులు అయోమయ స్థితిలో పడిపోయారు. ఈ క్రమంలో వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు నడుం బిగించింది.
మధ్యవర్తులు ఎవరు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి పంట నష్టం సహాయాన్ని అందించేందుకు నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఇక దీనికోసం 135.78 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇటీవల ఇన్పుట్ సబ్సిడీని ఏపీ ముఖ్యమంత్రి జగన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో సంతోషంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పంట నష్టపోయిన రైతులందరికీ అదే సీజన్లో సాయం అందించిన ఘనత ప్రభుత్వం తమదేనంటూ తెలిపారు సీఎం జగన్. రైతుల ఖాతాల్లో పంట నష్టం సాయంగా ప్రభుత్వం జమచేసిన డబ్బులు బ్యాంకులో పాత రుణం కింద జమ చేసుకోకుండా ఉండేలా ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సీఎం జగన్ తెలిపారు.