పెన్షన్ లబ్ది దారులకు సీఎం జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి వృద్ధులు, వితంతు, దివ్యాంగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నేటి నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తోంది.
ఇందు కోసం రూ. 1,585.60 కోట్లను గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లో జమ చేసింది. మొత్తం 62,33,382మంది లబ్ధిదారులకు 2.66లక్షల మంది వాలంటీర్లు పెన్షన్ డబ్బులు అందిస్తున్నారు. 5 వ తేదీ వరకు పెన్షన్లు ఇవ్వనున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్న వారు కూడా.. స్వ గ్రామాలకు వచ్చి పెన్షన్లు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.