నేడు విశాఖకు సీఎం జగన్.. 28 కి.మీటర్ల బీచ్ శుభ్రత కార్యక్రమం!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖకు వెళ్లనున్నారు. ఉదయం 8:30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1:55 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకోనున్నారు. అయితే విశాఖ బీచ్ పరిరక్షణ కోసం అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ పార్లే ఫర్ ది ఓషన్స్ తో జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నేతృత్వంలో బీచ్ పరిశుభ్రత కార్యక్రమం జరగనుంది.

విశాఖ బీచ్

విశాఖ బీచ్ శుభ్రత కార్యక్రమంలో దాదాపు 20 వేల మంది పాల్గొననున్నారు. దాదాపు 28 కిలో మీటర్ల వరకు బీచ్‌ను శుభ్రం చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమానికి పార్లే సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఆయా స్వచ్ఛంద సంస్థలు హాజరుకానున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ ఇటీవల మెక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిన గ్రాడ్యుయేట్లకు ధ్రువపత్రాలు ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version