ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో తెలంగాణకు అవార్డు

-

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుంది. ఇప్పటికే హైదరాబాద్‌ తో కూడిన తెలంగాణ రాష్ట్రం… ఎన్నో రంగాల్లో ఎవరికీ అందని స్థాయికి ఎదిగింది. ఈ నేపథ్యంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణకు మరో అవార్డు వచ్చింది.

ఈ మేరకు గురువారం రోజున న్యూ ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన డిజిటెక్‌ కాంక్లేవ్‌లో తెలంగాణ ప్రభుత్వం తరపున అవార్డు అందుకున్నారు తెలంగాణ మంత్రి కె.తారక రామారావు. ‘మీ సేవ’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలకు గుర్తింపుగా తెలంగాణకు అవార్డు వచ్చింది.

వ్యాపారాన్ని సులభతరం చేయడం (ఈవోడీబీ)లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రఖ్యాత బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ అవార్డును అందించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత్తమంగా ఉన్నాయని ప్రశంసించింది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో జరిగిన ‘డిజిటెక్‌ కాంక్లేవ్‌ 2022’లో తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి కే.తారకరామారావు పాల్గొని ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version