చంద్రబాబుకు సీఎం జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు

-

ఇవాళ తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతి పక్ష నాయకులు, మాజీ సీఎం నారా చంద్రబాబు పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలోనే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి… నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన సోషల్ మీడియా వేదికగా… చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు.. బతకాలని కోరారు సీఎం జగన్.

ఇదిలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా… చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహిస్తున్నారు.

ఇక.. తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు నారా లోకేష్‌. మా నాన్న సూపర్ స్టార్..అందరి ధైర్యంఅని ట్వీట్‌ చేశారు. జన్మనిచ్చేవారే కాకుండా చదువు చెప్పేవారు, అన్నం పెట్టిన వారు, భయాన్ని పోగొట్టేవారు కూడా తండ్రితో సమానం అని చాణక్యుడు చెప్పాడన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version