ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు సీఎం రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు..!

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గ‌న్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు చెప్పారు. పొట్టి శ్రీరాములు తోపాటు అనేక మంది త్యాగాల ఫ‌లితంగానే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏర్పాటైందని అన్నారు. వారి త్యాగాల‌ను మ‌నం స్పూర్తిగా తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించారు. అదే సంక‌ల్పం..అంకిత భావం చిత్తశుద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళదామని సీఎం వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ సంధ‌ర్బంగా సీఎం క్యాంప్ కార్యాల‌యంలో సోమ‌వారం ఉద‌యం 10 15 గంట‌ల‌కు రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌తాకాన్ని ఆవిష్క‌రిస్తారు. ఆ త‌ర‌వాత తెలుగుత‌ల్లికి అదేవిధంగా పొట్టిశ్రీరాములుకు నివాళులు అర్పించి గౌర‌వ వంద‌నం స్వీక‌రిస్తారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version