ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన ’న్యాయస్థానం నుంచి దేవస్థానం‘ మహాపాదయాత్ర నేడు ప్రారంభం కానుంది. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ ఇవ్వడంతో పాదయాత్రం నేడు ప్రారంభం కానుంది. అమరావతిని ఏపీ రాజధానిగా కొనాసగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. మొత్తం 45 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. సర్వమత ప్రార్థనల అనంతరం తూళ్లురు దీక్షా శిబిరం నుంచి పాదయాత్ర మొదలు కానుంది. రోజుకు 15 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర సాగనుంది.
మహాపాదయాత్రకు ఏపీలోని ప్రతిపక్షాల నుంచి మద్దతు లభించింది. టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీల నుంచి మద్దతు లభించింది. పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపాలని ప్రజలను టీడీపీ కోరింది.