ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. 2014 జూన్ నాటికి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నిర్ణయంలో మార్పు చేపట్టారు.
2014 జూన్ 2 ముందు నియమించబడి.. ఇప్పటివరకు కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులర్ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు స్వతంత్ర దినోత్సవం రోజు ఫైల్ పై సీఎం జగన్ సంతకం చేశారు. ఇందుకు సంబంధించి నాలుగు రోజులలో ఉత్తర్వులు వెలవడనున్నాయి. దీంతో సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు కాంట్రాక్ట్ ఉద్యోగులు.