క్షమాపణలు చెప్పినా రానాను వదలని సోనమ్..!

-

పాన్ ఇండియా హీరో రానా ఇటీవల కింగ్ ఆఫ్ కొత్త ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్లు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఆయన సోనం కపూర్ కి క్రమశిక్షణ లేదు అన్నట్టుగా మాట్లాడారు. అయితే రానా క్షమాపణలు చెప్పినా సోనం కపూర్ మాత్రం చల్లబడినట్టు కనిపించడం లేదు. పరోక్షంగా ఆమె కూడా రానాకు కౌంటర్ వేసింది. అలాంటి వ్యక్తులే మనుషుల గురించి మాట్లాడుతారని ఒక కోట్ షేర్ చేయడం గమనార్హం. “సంకుచిత మనస్తత్వం కలవారు ఇతరుల గురించి మాట్లాడుతారు.. అయితే సాధారణ మనుషులు సంఘటనల గురించి మాట్లాడుతున్నారు.. మేధావులు మాత్రమే నూతన ఆలోచనల గురించి చర్చించుకుంటారు” అంటూ ఒక కోట్ పంచుకుంది.

అయితే ఈ పోస్ట్ చూసిన చాలా మంది రానాకు సోనమ్ కౌంటర్ వేసింది అంటూ కొంతమంది భావిస్తుంటారు. ముఖ్యంగా తన గురించి తప్పుగా మాట్లాడిన రానాను ఆమె సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు అని చెబుతున్నారు. అసలు వివాదం ఏమిటంటే దుల్కర్ సల్మాన్ తాజాగా నటించిన చిత్రం కింగ్ ఆఫ్ కొత్త. ఈ సినిమా ఆగస్టు 24వ తేదీన విడుదల కానున్న నేపద్యంలో హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా రానా హాజరయ్యారు.. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ దుల్కర్ చాలా సహనపరుడు. ఎంతో సింపుల్ గా ఉంటాడు.

గతంలో దుల్కర్ సల్మాన్ చేసిన ఒక బాలీవుడ్ సినిమా నిర్మాతలు నా స్నేహితులు ఆ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతున్నప్పుడు నేను సెట్స్ కి వెళ్ళాను. అయితే ఆ చిత్రంలో నటిస్తున్న ఒక బడా బాలీవుడ్ హీరోయిన్ షాపింగ్ గురించి భర్తతో ఫోన్లో మాట్లాడుతూ.. దుల్కర్ ని చాలా సేపు వెయిట్ చేయించింది. టేక్ మీద టేకులు తీసుకుంటూ మధ్యలో ఫోన్స్ మాట్లాడుతున్నా కూడా దుల్కర్ ఎండలో సహనంతో ఎదురు చూశాడు. చివరికి నా సహనం కూడా నశించింది అంటూ చెప్పడంతో ఆ కామెంట్స్ తో సోనం కపూర్ ట్రోల్స్ కి గురైంది. దీంతో ఈ వివాదం కాస్త ఇప్పుడు గుప్పుమంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version