ఎన్నికల్లో మన బతుకులను మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని ఏపీ సీఎం జగన్ సూచించారు. తాజాగా ఆయన బస్సు యాత్రలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా మహిళలకు ఇంటి పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్ బీసీల నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. చేనేత వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంతో ఆ వర్గానికే తాను సీటు ఇచ్చానని చెప్పుకొచ్చారు.
మోస పూరిత హామీలు తాను ఇవ్వనని..చేసేదే చెబుతానని స్పష్టం చేశారు. నేతన్నల కోసం తన హయాంలో రూ 3 వేల కోట్లు ఖర్చు చేసామని వెల్లడించారు జగన్. వైసీపీ పాలనలో వివక్ష లేకుండా, పార్టీలు చూడకుండా సంక్షేమం అందిస్తున్నామని వివరించారు. 14 ఏళ్లుగా సీఎం చేశానని చంద్రబాబు చెప్పుకుంటారని..తాను ఆయనన్ని సార్లు సీఎంగా పని చేయకున్నా.. ఆయనంత నెగిటివిటీ అనుభవం మాత్రం లేదని జగన్ వ్యాఖ్యానించారు.