ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. పన్నుల వసూళ్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం..

-

ఏపీలో పేరుకుపోయిన బకాయిల వసూలుకు వన్‌ టైమ్‌ సెటిల్‌ మెంట్‌ విధానాన్ని తీసుకురావాలని జగన్ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. రెవెన్యూ అందించే శాఖల పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష చేశారు. ఓటీఎస్‌ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తిచేయాలని.. టిడ్కోకు రిజిస్ట్రేషన్లను కూడా వేగంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు.

cm jagan

గ్రామ, వార్డు సచివాలయాల్లోకి రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చాక సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించాలని.. ఎలాంటి సేవలు పొందవచ్చు అన్న అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ పరంగా అందించే ఇతర సేవల పైన కూడా పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని.. అక్టోబరు 2న తొలి విడత కింద రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించాలని వెల్లడించారు.

శాశ్వత భూ హక్కు, భూ రక్ష పత్రాలతో పాటు సంబంధిత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలని.. వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు ఉండాలన్నారు. వాణిజ్య పన్నుల శాఖ పునర్‌ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్… శాఖలో ప్రతి ఒక్కరి పాత్ర, బాధ్యతల పై స్పష్టత ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version