సీఎం జగన్ కొత్త వ్యూహం.. వచ్చే ఎన్నికలే టార్గెట్..!!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కొత్త వ్యూహం రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్ బ్యాంకుకు గండి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రతిపక్షాలు కూడా జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు లక్ష్యంగా పని చేస్తున్నాయి. అయితే, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గెలుపు కోసం వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని, అలాగే ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు.

సీఎం జగన్

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అప్పుడే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సీఎం జగన్ తెలిపారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు రాష్ట్రంలో గెలుపు ఓటములను నిర్దేశిస్తాయని అన్నారు. కాగా, 2019 ఎన్నికల్లో జగన్ అమలు చేసిన ‘సోషల్ ఇంజినీరింగ్’ టీడీపీపైన అనూహ్య గెలుపును అందించింది. గ్రామీణ ప్రాంత ఓటింగ్ పూర్తిగా సీఎం జగన్‌కు అనుకూలంగా ఉన్నాయని సమాచారం. వీటితోపాటు ప్రతిపక్ష పార్టీల ఓటు బ్యాంకును సొంతం చేసుకోవడానికి కొత్త ఫార్మట్‌లో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version