కేంద్రం ఇచ్చినట్లు నిరూపిస్తే.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా : కెసిఆర్ సవాల్

-

గొర్రెల పైసలు తాము ఇచ్చామని.. గొర్రెల పైసలు కేంద్రం ఇచ్చినట్లు నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని బండి సంజయ్ కి సవాల్ విసిరారు తెలంగాణ సిఎం కెసిఆర్. తెలంగాణ లో ఉన్న ఒక్క పథకం అయిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉందా ? అని ప్రశ్నించారు కెసిఆర్. ఈ పథకం కోసం అప్పు తీసుకుని వడ్డీ కడుతున్నామని.. బీజేపీ రాష్ట్రాల్లో ఎందుకు ఈ పథకం లేదని నిలదీశారు.

కర్ణాటక లో ప్రభుత్వం కూల్చి దొడ్డి దారిన ప్రభుత్వం నడుపుతున్నారని.. ప్రభుత్వాలను కూల్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని బిజేపి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 107 సీట్లలో బీజేపీ డిపాజిట్ పోయిందని.. నాగార్జున సాగర్ లో కూడా బీజేపీ డిపాజిట్ పోయిందని చురకలు అంటించారు. బిజేపి ని ప్రశ్నిస్తే దేశ ద్రోహం అంటారు… తెల్లారితే ఐటీ దాడులు చేస్తారని.. పిట్ట బెదిరింపులకు బెడిరిపోమని హెచ్చరించారు. బండి సంజయ్ వొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని అని వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version