ఫామ్ హౌస్ నా వ్యవసాయ క్షేత్రం..బాజాప్త వెళ్తా : కేసీఆర్

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి బిజెపి ప్రభుత్వం పై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఇన్ కమ్ టాక్స్, ఈడి లతో రైడ్ లు చేయిస్తే భయపడని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇన్కమ్ టాక్స్ లతో రైడ్ లు చేయించడం కేంద్ర ప్రభుత్వ స్టైల్ అని అన్నారు. హద్దుమీరి మాట్లాడకు బండి సంజయ్ అంటూ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నా హద్దులు నాకు తెలుసు అని అంతర్జాతీయస్థాయిలో క్రూడాయిల్ ధరలు పెరగలేదని కేసిఆర్ అన్నారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చేయలేదని దానికి అనేక కారణాలు ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఫాంహౌస్ వ్యవసాయ క్షేత్రం అని అది నా నియోజకవర్గంలో ఉందని.. బాజాప్తా వెళతానని కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా బిజెపి ఏ వర్గానికీ మేలు చేసింది అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. అనేక సందర్భాల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది అని అప్పుడు దేశద్రోహి కాని మేము ఇప్పుడు ఎలా దేశద్రోహులము అయ్యామని కేసీఆర్ బండి సంజయ్ ని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులు.. నక్సలైట్లు అంటూ నిందలు వేస్తారు అని కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version