తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి.ప్రతి రోజు 2500 లకూ పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండుగ అనంతరం తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలను సీఎం కేసీఆర్ కొట్టిపారేశారు. నైట్ కర్ఫ్యూ పై ఇంకా తాము నిర్ణయం తీసుకోలేదని… అలాంటి ఆలోచనే లేదన్నారు సీఎం కేసీఆర్. నిన్న కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కరోనా వైరస్, ఓమిక్రాన్ వేరియంట్ పట్ల ప్రజలు జగ్రత్తగా ఉండాలని సూచించారు.ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని అన్నారు. ప్రజలే స్వీయ నియంత్రణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించిచారు.
అలాగే కరోనా, ఓమిక్రాన్ ల వ్యాప్తి ప్రజలు ఎవరూ కూడా భయాందోళన చేందకుడదని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రులలో అన్ని సౌకర్యాలు చేపడుతున్నామని తెలిపారు. ఆక్సిజన్ బెడ్స్ తో పాటు మరిన్నీ ఏర్పాట్టు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వివరించారు.