కాకులకి అన్నం ఎందుకు పెట్టాలి..? దీని వెనుక వుండే కారణం ఇదేనా..?

-

పూర్వ కాలం నుండి కూడా కాకులకి అన్నం పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. మన ఇంట్లో ఎవరైనా చ‌నిపోతే మూడ‌వ రోజు, ప‌ద‌వ రోజున కాకుల‌కు పిండం పెట్ట‌డం చేస్తాం. పూర్వకాలం నుంచి కూడా దీనినే సంప్రదాయంగా అనుసరిస్తున్నాం. అయితే ఎందుకు కాకులకు పెట్టాలి. దీని వెనుక గల కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

హిందూ ధర్మంలో ఉన్న ప్రతీ ఆచారం వెనుక సైన్స్ తో పాటు జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు ఉన్నాయి. పిండం పెట్టిన‌ప్పుడు మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం, ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారంగా వచ్చింది.

గరుడ పురాణం తో పాటు మరి కొన్ని పురాణాల ప్రకారం చనిపోయిన పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని, అందుకే వారు మరణించిన తిథులు, అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీ. కాకులు వచ్చి తింటే చనిపోయిన వారు ఆనందంగా ఉంటారు అని కూడా అంటారు.. పితృదేవతలు ఆశీర్వదిస్తే ఎటువంటి చెడు జరగదనేది న‌మ్మ‌కం.

కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు “ఇదం పిండంగృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం” అనే మంత్రాన్ని చదువుతారు, ఆ మంత్రానికి అర్థం “గాలిలో విహరించే పక్షుల, నీటిలో నివసించే జలచరాల రూపంలో ఉండే పితృ దేవతలకి ఆహారం అందించాలి ” అని. చనిపోయిన వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుంది అని కొన్ని శాస్త్రాలలో ఉంది.

శ్రీ రాముడు ఒక భక్తుడికి నీ పూర్వికులు కాకి రూపంలో విహరిస్తుంటారు, కాకులకి ఆహారం పెడితే నీ పూర్వికులకి చేరుతుందని ఒక వరం ఇస్తాడు, రాముడి వరం ప్రకారమే నేటికీ కాకులకి ఆహారాన్ని పెడతారనే ఒక క‌థ కూడా ఉంది.

అలానే మనం బాగుంటాం కూడా. పైగా కాకి శని భగవానుడి వాహనం. నోములు వ్రతాలు చేసుకునే సమయంలో నైవేద్యానికి తయారు చేసిన దానితో పాటు కొంత కాకులకి వేస్తే వ్రతం, నోము పూర్తయినట్లు కొంత మంది భావిస్తూ ఉంటారు. అందుకనే కాకులకి అన్నం పెట్టాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version