గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాసేపటి క్రితం పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మ అవార్డు గ్రహీతలలో తెలంగాణకు చెందిన పలువురు కూడా ఉన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి భారత్ బయో టెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల దంపుతలకు పద్మ భూషణ్ అవార్డు దక్కింది. అలాగే దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్య, పద్మజా రెడ్డిలకు పద్మ అవార్డులు దక్కాయి.
కాగ వీరినీ ముఖ్య మంత్రి కేసీఆర్ అభినందించారు. దర్శనం మొగిలయ్య.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా తర్వాత ఫెమస్ అయ్యాడు. తెలంగాణలో అరుదైన కళతో సంగీతాన్ని సృష్టించే మొగిలయ్యకు కళా రంగంలో పద్మ అవార్డు దక్కింది. అలాగే మరో రెండు పద్మ అవార్డులు కూడా కళారంగంలోనే వచ్చాయి. రామ చంద్రయ్య, పద్మజా రెడ్డి కూడా కళా రంగం లోనే పద్మ అవార్డులు వచ్చాయి. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మూడు పద్మ అవార్డులు.. కళారంగం లోనే వచ్చాయి.