పీవీకి భారతరత్న ఇవ్వాలి : కేసీఆర్

-

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ లో మంగళవారం అత్యున్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…తెలంగాణ బిడ్డ అయినటువంటి మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు దేశానికి అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఈ 28న ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో నిర్వహించనున్నామని, ఈ వేడుకల నిర్వహణను మంత్రి కేటీఆర్‌ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ వేడుకల నిర్వహణకు తక్షణమే 10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ కేంద్రాన్ని కోరారు. పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరుతూ శాసనసభ, మంత్రివర్గంలో తీర్మానం చేసి తానే స్వయంగా ప్రధానికి అందించనున్నట్లు సీఎం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version