మోడీని శంకరగిరి మాన్యాలకు పంపాలి – సీఎం కేసీఆర్

-

సోమవారం నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్, కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మరోసారి బిజెపిపైై విరుచుకుపడ్డారు. బిజెపి ముక్త్ భారత్ కావాలన్నారు. అన్ని అమ్మే నరేంద్ర మోడీని శంకరగిరి మాన్యాలకు పంపాలని మండిపడ్డారు సీఎం కేసీఆర్. 2024లో కేంద్రంలో మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సీఎం కేసీఆర్ జోష్యమ్ చెప్పారు. అధికారంలోకి రాగానే దేశమంతా ఉచితంగా కరెంటు ఇస్తామని.. జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని నిజామాబాద్ గడ్డమీద నుంచే ప్రారంభిస్తారని చెప్పారు.

KCR and Modi

28 రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి దేశ రాజకీయాలలోకి రావాలని ఆహ్వానించారని తెలిపారు. నిజామాబాద్ కాల్వలో నీళ్లు రావాలా? మత పిచ్చి మంటలతో రక్తం పారాలా అని ప్రశ్నించారు. దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నట్లు చెప్పారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని నరేంద్ర మోడీ చెబుతున్నారని.. బావి కాడ మీటర్లు పెట్టమనే మోడీని సాగనంపాలని అన్నారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సాగు భారమైందన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదన్నారు. 1956 లో జరిగిన చిన్న పొరపాటును 60 ఏళ్లు పోరాటం చేసి మళ్లీ తెలంగాణ సాధించుకున్నాం అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version