2024లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమే – సీఎం కేసీఆర్

-

నిజామాబాద్ జిల్లాలోని ఎల్లమ్మ గుట్టలో నూతనంగా నిర్మించిన టిఆర్ఎస్ పార్టీ ఆఫీసును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ నిజానికి మధ్యాహ్నం రెండు గంటలకు హెలికాప్టర్లో రావలసిన ఆయన గంట ఆలస్యంగా నిజామాబాద్ కి చేరుకున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆయన హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యారు. అక్కడినుండి రోడ్డు మార్గాన వెళ్లి టిఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు.

తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పార్టీ ఆఫీసులో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ ఆఫీసులోని ఆవరణలో మొక్క నాటారు టిఆర్ఎస్ అధినేత. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 2024లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమేనని అన్నారు.

అధికారంలోకి వచ్చాక తెలంగాణ మాదిరిగా దేశమంతా ఫ్రీగా 24 గంటల కరెంటును ఇస్తామన్నారు. దేశ రాజకీయాలలో టిఆర్ఎస్ కూడా ప్రవేశిస్తుందని కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్ కాలువల్లో నీళ్లు రావాలా..? మత పిచ్చి మంటలతో రక్తం పారాలా? అని అన్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version