రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలో విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది . ఉద్యోగులు పరస్పరం అంగీకరిస్తే.. బదిలీలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే పరస్పర బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే.. చాలా మంది ఉద్యోగులు బదిలీలు జరుపుకునే అవకాశం ఉంటుంది.
పరస్పర బదిలీలతో పాటు భార్య భర్తల బదిలీలకు సంబంధించిన వినతులను కూడా వెంటనే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఇప్పటి కే దాదాపు 70 వేల కు పైగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియా ముగిసింది. అయితే కొంత మంది ఉద్యోగులు పని చేస్తున్న చోటు కాకుండా ఇతర జిల్లాలు, జోన్లు, బహుళ జోన్లుకు బదిలీ అయ్యారు. అలాగే మరి కొంత మంది భార్యభర్తలు కూడా బదిలీల పై వినితులు కోరుతున్నారు. దీంతో ఉద్యోగుల బదిలీల ప్రక్రియా త్వరగా ముగించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.