నేతన్నలకు సీఎం కేసీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. నేతన్న బీమా” పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు సీఎం కేసీఆర్. నేతన్నల కోసం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం దేశంలో తొలిసారి అని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రంలోని 80 వేల మంది నేత కార్మికుల కుటుంబాలు ఈ బీమా ద్వారా లబ్ది చేకూరుతుందని చెప్పారు. దురదృష్టవశాత్తు ఎవరైనా నేత కార్మికుడు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటన చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ పథకం చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఉంటుందన్నారు. కేంద్రం పన్ను పెంపులతో చేనేత,పవర్ లూం రంగాన్ని కుదేలు చేస్తుందన్నారు. ఆ రంగం పై ఆధారపడ్డ పద్మశాలీ తదితర కుటుంబాలకు అన్ని వేళలా బాసటగా ఉంటుందని పేర్కొన్నారు సీఎం కేసీఆర్.