తెలంగాణ జోన్స్‌ ఇవే.. పక్కా అందరూ ఫాలో అవ్వాల్సిందే : కేసీఆర్

-

కేబినేట్ సమావేశం అనంతరం తెలంగాణా సిఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రం మార్గదర్శకాలను వివరించారు. ఆరెంజ్ లో 18 జిల్లాలు గ్రీన్ జోన్ లో 9 జిల్లాలు ఉన్నాయని వివరించారు. ములుగు, నాగర్ కర్నూలు, యాదాద్రి, వరంగల్ రూరల్, సిద్ధిపేట, భద్రాద్రి కొత్త గూడెం, వనపర్తి, మహబూబ్ నగర్, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణాలో లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు తెలంగాణా సిఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణాలో లాక్ డౌన్ ని మే 29 వరకు విధిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. అందరూ కూడా దీన్ని కచ్చితంగా ఫాలో అవ్వాలని ఆయన వివరించారు. కర్ఫ్యూ రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందని, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా లాక్ డౌన్ ని పెంచుతున్నామని ఆయన స్పష్టం చేసారు.

రెడ్ జోన్ జిల్లాలు హైదరాబాద్, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ అర్బన్. రంగారెడ్డి, మేడ్చల్, ఆరెంజ్ జోన్ జిల్లాలు సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, నారాయణపెట్, సిరిసిల్ల, నల్గొండ, నిజామాబాద్, అదిలాబాద్, ఖమ్మం ఉన్నాయని, ఆరెంజ్ జోన్ లో నుంచి కొన్ని జిల్లాలు గ్రీన్ జోన్ లోకి వెళ్ళిపోయాయి అని ఆయన వివరించారు.

మరి కొన్ని జిల్లాలు రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ కి వెళ్లాయని, సూర్యాపేట జిల్లా ఆరెంజ్ జోన్ లోకి వెళ్లిపోతుంది అని ఆయన చెప్పారు. గ్రీన్ జోన్ లో అన్ని షాపులు తెరుచుకోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. జనాలు ఒకరి మీద ఒకరు పడకుండా సరుకులు కొనుగోలు చేసుకోవచ్చు అని కేసీఆర్ సూచించారు. జనాలను మీడియా కూడా గమనించాలి అని, రిపోర్ట్ చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

జోన్ ల వారీగా కేంద్రం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. 27 జిల్లాల్లో అన్ని షాపులు నడుస్తాయని పేర్కొన్నారు. మండల కేంద్రం గ్రామాల్లో అన్ని షాపులు తెరుచుకునే ఉంటాయని, మండల కేంద్రం, గ్రామాల్లో అన్ని షాపులు తెరుచుకోవచ్చు అని పేర్కొన్నారు. రెడ్ జోన్ లో ఎలాంటి షాపులకు అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు. జోన్లతో సంబంధం లేకుండా కర్ఫ్యూని అమలు చేస్తామని వివరించారు.

రాత్రిపూట కర్ఫ్యూని ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. రెడ్ జోన్ లో కఠిన చర్యలు ఉంటాయని, కొన్ని రోజులు ఓపిక పడితే చాలు తప్పించుకుంటాం అని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 కంటైన్మేంట్ జోన్ లు ఉన్నాయని, ఈ నెల 15 న మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని, 15 వ తేదీకి పరిస్థితితి అంచనాకు వస్తుంది అని అప్పుడు నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version