ఏపీ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ అధినేతగా ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తోందని.. కానీ బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే, జాతీయం చేస్తామని ప్రకటించారు.
నిన్న ఏపీ నేతలు బీఆర్‌ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసగించారు. సంక్రాంతి తర్వాత ఏపీ నుంచి బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు ఉంటాయని కేసీఆర్ తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా చేరతామంటూ ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. ఏపీలో సిసలైన ప్రజా రాజకీయాలు రావాలని అన్నారు. ఎంత ఖర్చయినా విశాఖ ఉక్కును మళ్లీ పబ్లిక్ సెక్టార్‌లోకి తీసుకొస్తామన్నారు. మోదీ ప్రభుత్వానిది ప్రైవేటీకరణ విధానమైతే.. తమది జాతీయీకరణ విధానమని కేసీఆర్ స్పష్టం చేశారు.