తెలంగాణకు టైం ఇవ్వరు కానీ.. పక్క రాష్ట్రాల వాళ్లని కలుస్తారు.. కేసీఆర్​పై రేవంత్ ఫైర్

-

ఏపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసమే బీఆర్ఎస్ పనిచేయనుందని ఆరోపించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఇలా చేయిస్తున్నారని అన్నారు. ఏపీ నుంచి వచ్చి బీఆర్ఎస్​లో చేరిన వారికి.. ఇంట్లో తిండి కూడా పెట్టరన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు, ప్రజలను కలిసే సమయం ఇవ్వని కేసీఆర్‌.. పక్క రాష్ట్రం వాళ్లను మాత్రం కలుస్తున్నారని రేవంత్ విమర్శించారు. ఉమ్మడి శత్రువులను తిప్పికొట్టడానికి బీఆర్ఎస్, బీజేపీ తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

కేసీఆర్‌కు అధికారం తాత్కాలికమేనని.. ఎల్లకాలం ఇలా ఉండదని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో కాంగ్రెస్‌ నుంచి బీఆర్ఎస్​లో చేరిన 12మంది ఎమ్మెల్యేలనూ విచారించాలని డిమాండ్ చేశారు. అయ్యప్పల వ్యవహారంలో రాజకీయ కుట్ర దాగుందన్న రేవంత్‌.. వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాని అనుమానం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version