నిరుద్యోగులకు సీఎం గుడ్ న్యూస్… తెలంగాణాలో మొత్తంగా 91,142 ఉద్యోగ ఖాళీలు, వెంటనే నోటిఫికేషన్లు

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ఉద్యోగ విభజన పూర్తి అయిన తర్వాత రాష్ట్రంలో 91,142 ఖాళీలు ఉన్నాయమని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీటిని వెంటనే నోటిఫై చేసి ఉద్యోగ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన అన్నారు.  కాంట్రాక్ట్ పోస్టులు 11,103 మంది ఉద్యోగులు ఉన్నారని.. వారి వయసు అయిపోతుందని.. ఇటీవలే హైకోర్ట్ పర్మిషన్ ఇచ్చిందని.. త్వరలోనే కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని పర్మినెంట్ చేస్తున్నామని అన్నారు. 80039 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల అవుతాయని ఆన్నారు. దీంట్లో విద్యాశాఖలోనే 20 వేల నుంచి 30 వేల ఉద్యోగాలు ఉన్నాయని ఆయన అన్నారు. స్థానిక ఉద్యోగులకు 95 శాతం దాకా స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. తెలంగాణలో అటెండర్ నుంచి ఆర్డీఓ దాకా స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయని అన్నారు.తెలంగాణ పోలీస్ శాఖలో 18,334, విద్యాశాఖలో 13,086, ఉన్నత విద్యాశాఖలో 7,878, రెవెన్యూ శాఖలో 3,560, వైద్య ఆరోగ్యశాఖలో 12,755, బీసీ సంక్షేమ శాఖలో 4,311, సాగునీటి శాఖలో 2,692, ఎస్సీ సంక్షేమ శాఖలో 2,879, ట్రైబల్ వేల్ఫేర్‌లో 2,399 ఖాళీలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version