కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు సీఎం కేసీఆర్. కాసేటి క్రితమే..తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అటెండర్ పోస్ట్ నుంచి ఆర్డీవో పోస్టు దాకా 95 శాతం ఉద్యోగాలు లోకల్ వారికే వస్తున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 91,147 ఉద్యోగాల భర్తీకి ఈ రోజు నుంచే నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయగా, ఇప్పటివరకు 1.33 లక్షల పోస్టులను భర్తీ చేసిందని ప్రకటన చేశారు. దాదాపు 23,000 పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతోందన్నారు. ఏపీ ప్రభుత్వం తీరు కారణంగా.. ఉద్యోగాలను భర్తీ చేయలేకపోతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఉద్యోగుల విభజన జరుగలేదని ఆగ్రహించారు.