కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ ఇవాళ పర్యటించనున్నారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వరస్వామి కల్యాణ వేడుకల్లో పాల్గొనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ ఉదయం బేగంపేట నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు 10.40 గంటలకు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి కాన్వాయ్‌లో 10.55 గంటలకు తిమ్మాపూర్‌లోని తిరుమల వేంకటేశ్వర ఆలయానికి చేరుకుంటారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొంటారు. అనంతరం ఇక్కడే ఏర్పాటు చేసిన కృతజ్ఞత కార్యక్రమానికి హాజరవుతారు.
బ్రహ్మోత్సవ క్రతువులో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు హెలీకాప్టర్‌లో పయనమవుతారు. తిరిగి బాన్సువాడ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని సీఎంవో తెలిపింది. దాదాపు రెండున్న గంటల పాటు సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగనున్నది. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. బాన్సువాడ పట్టణంతో పాటు, ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను సీఎం ప్రత్యేక వ్యక్తిగత రక్షణ బృందం, డాగ్ స్కాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారు.