BREAKING : సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

-

ఇవాళ మార్చి ఒకటో తారీకు. ఈ నేపథ్యంలో సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 14.2 కేజీ డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరపై వేగంగా 50 రూపాయలు పెరిగింది.

gas cylinder

అలాగే, 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 350.50 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో డొమెస్టిక్ సిలిండర్ ధర 1155 రూపాయలకు చేరింది. ఇక గ్యాస్ సిలిండర్ పెరుగుదలతో.. కేంద్ర ప్రభుత్వంపై సామాన్యులు మరోసారి ఫైర్ అవుతున్నారు. కాగా,  పెరిగిన ధరలు ఇవాల్టి నుంచి అమలు కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version