సిఎం కెసిఆర్ సంచలన ప్రకటన : మరో 80 వేల కొత్త ఉద్యోగాలు భర్తీ !

-

తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ వేదికగా శుభవార్త చెప్పారు. కొత్త జోనల్ తో 95 శాతం లోకల్ వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు వస్తాయని.. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి.. ప్రధాని తో పంచాయతీ పెట్టుకుంటే కొత్త జోనల్ వ్యవస్థ సాధ్యమైందని చెప్పారు. ప్రధాని మోడీని ఒప్పించి తెచ్చిన కొత్త జోనల్ వ్యవస్థ ల్యాండ్ అవుతుందని పేర్కొన్నారు. త్వరలోనే ఏ జిల్లాకు ఎన్ని జాబ్స్.. అనేది తెల్చుతామన్నారు సిఎం కెసిఆర్.

KCR-TRS

నెల, రెండు నెలల్లో ఖాళీలను రిక్రూట్ చేస్తామని.. దసరా తర్వాత… ఎక్కడి వాళ్లకు అక్కడ ఉద్యోగాలు అని వెల్లడించారు సిఎం కెసిఆర్. ఇక ఈ కొత్త జోనల్ వ్యవస్థ కారణంగా 70 నుంచి 80 వేల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారు.

మెడికల్ డిపార్ట్ మెంట్ లో ప్రమోషన్ లు ఇస్తామని హామీ ఇచ్చారు సిఎం కెసిఆర్. జర్నలిస్టులు, అడ్వకెట్ల సంక్షేమ నిధి పెట్టీ కరోనా టైం లో ఆదుకున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు లక్ష 51 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చామని.. లక్ష 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అయినట్లు వెల్లడించారు. ఉద్యోగాలు తెకక్కున్న వాళ్ళ సెల్ నెంబర్ తో సహా సభ ముందు ఉంచుతామని.. అప్పుడైన ప్రతిపక్షాలు నమ్ముతాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version