వీడియో.. పామును తలకు పెట్టుకుని షాపింగ్ వచ్చేసిన మహిళ..అంతే పరుగులు తీసిన ప్రజలు

-

ఫ్యాషన్ అంటే అమ్మాయిలు..అమ్మాయిలంటే ట్రెండ్..ఎక్కడలేని ట్రెండింగ్ అంతా వాళ్లే ఫాలో అవుతుంటారు. అబ్బాయిలు ఎప్పుడు హెయిర్ స్టెల్ మీద ఫోకస్ చేస్తారు. కానీ అమ్మాయిలకు అలా కాదు..కాలు ఏసుకునే చెప్పులనుంచి జడకు పెట్టుకునే బ్యాండ్ వరకూ వాళ్లు అన్నీ స్టైయిల్ గా ఉండాలనే అనుకుంటారు. అలానే ఓ మహిళ వింతైన హెయిర్ బ్యాండ్ పెట్టుకొచ్చేసింది..అది చూసి జనం పరుగులు తీశారు.
ఆ మహిళ ఏకంగా పామునే హెయిర్ కు చుట్టుకువచ్చింది. పురాణాల్లో శివుడు మెడకు ఎలా అయితే పాము ఉందో అలా ఆమె తన కొప్పుకు పామును చుట్టుకొచ్చింది. అంతే అది చూసి అక్కడున్న వారంతా పరుగులుతీశారు. మరికొందరు ఉత్సాహంగా ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యాయి.

అసలేం జరిగిందంటే..

ఓ మహిళ షాపింగ్‌ చేయడానికి మాల్‌కు వెళ్లింది. ఆ సమయంలో మాల్‌ లో ఉన్న వారంతా ఆమె తలపై ఆసక్తిగా చూశారు.. దీనికి కారణం ఆమె జుట్టుకు విచిత్రమైన ఓ హెయిర్‌ బ్యాండ్‌ ఉండటమే. మొదట్లో అందరూ అది ఒక రకమైన హెయిర్‌ బ్యాండ్‌ అనుకున్నారు. కానీ అది కదులుతుండటంతో అదొక పాము అని అప్పుడు తెలుసుకున్నారు. కొందరేమో అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
కానీ ఓ వ్యక్తి సదరు మహిళ తలపై పెట్టుకున్న పామును వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో చూసిన కొందరు ఇదేం ఆలోచనరా బాబు అని తిడుతుంటే మరికొందరు మాత్రం బాగుంది అంటూ కమెంట్ చేశారు. మరి ఈ పాము హెయిర్‌ బ్యాండ్‌ ఎలా ఉందో మీరూ ఈ వీడియోలో చూసేయండి.
ఇలాంటి వింత ఆలోచనలు, టెస్టుల్లో అమ్మాయిలు ఎప్పుడు ముందుంటారు. ఈ ఆలోచనలన్నీ సోషల్ మీడియా వల్ల ఇంకా వైరల్ అవుతున్నాయి. అసలు ఆమె పామును ఎందుకు పెట్టుకొచ్చిందో ఎవరికి తెలియటంలేదు. ఆమెకు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో. ఎవరైనా పెంపుడు జంతువులుగా..ఏ కుక్కనో, పిల్లినో పెంచుకుంటారు. ఈమె ఏకంగా పాము పెంచుకుని..మనం పెంచిన పామే కదా ఏం చేస్తుందిలే అనుకుని పెట్టుకొచ్చినట్లు ఉంది అని కొంతమంది కమెంట్ చేస్తున్నారు. ఏదిఏమైనా ఇలాంటి విషసర్పాలను పెంచుకోవటం సమస్యే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version