తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… సంచలన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టిఆర్ఎస్ పార్టీ… అధికారం చేపట్టడం ఖాయమని ప్రకటించారు. అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 95 నుంచి 105 సీట్లు గెలవబో తుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. తమ దగ్గర ఓ మాస్టర్ ప్లాన్ ఉందని… అది అమలు చేస్తే మళ్లీ అధికారం తమదేనని పేర్కొన్నారు.
ఈసారి ఎమ్మెల్యే టికెట్లను ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే… ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కుండబద్దలు కొట్టారు.తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే … అవసరం అస్సలు లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. కావాలనే కొంతమంది సోషల్ మీడియా లో ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు సీఎం కేసీఆర్. తమకు 103 సీట్లు ఉన్నాయని… ఇలాంటి సమయంలో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతామని ప్రశ్నించారు.