ప్రధాని మోడీతో ముగిసిన కేసీఆర్ భేటీ.. 16 డిమాండ్స్ పెట్టిన సీఎం !

-

ఢిల్లీ: కాసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడి తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా ప్రధాని దృష్టి కి మొత్తం 16 అంశాలు సీఎం కేసీఆర్‌ తీసుకు వెళ్లినట్లు సమాచారం. అలాగే.. 10 అంశాలకు సంబంధించి లేఖలు అందజేశారు సీఎం కేసీఆర్. ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై చర్చ జరిగింది.

ఇక గోదావరి, కృష్ణానదీ జలాల వివాదాలు, బోర్డు ల పరిధులను నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లను తెలంగాణ సర్కార్ వ్యతిరేకించగా… శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలవిద్యుదుత్పత్తి ని తెలంగాణ ప్రభుత్వం నిలిపేయాలంటూ ఇప్పటికే మూడు సార్లు ప్రధానికి లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కృష్ణా జల వివాదాలపై గతంలో ఏర్పాటైన ట్రిబ్యునల్ స్థానంలో కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కేంద్రాన్ని కోరుతోంది.

అలాగే, “కరోనా” సమయంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధాని మోడీతో చర్చించారు సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ప్రకటించాలంటూ ప్రధానిని కోరిన కేసీఆర్.. “మిషన్ భగీరథ” కు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందించాలణటూ ప్రధాని కోరినట్లు సమాచారం. IPS క్యాడర్ సమీక్ష, ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్స్‌టైల్ పార్క్, హైడ్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి, కొత్త జిల్లాలలో జవహర్ నవోదయ విద్యాలయాలు, PMGSY కోసం అదనపు నిధులు, LWE ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ రోడ్ వర్క్స్, PMGSY అప్‌గ్రేడేషన్, కరీంనగర్ వద్ద IIIT మంజూరు, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు పై ప్రధానికి లేఖలు అందించారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version