ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు – సీఎం కేసీఆర్

-

ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందన్నారు సీఎం కేసీఆర్. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26 న జరుపుకునే, ” రాజ్యాంగ దినోత్సవం” సందర్భంగా.. తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. మహనీయుడు, భారత రత్న డా.బి.ఆర్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం.. కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత వివక్షకు అతీతంగా, దేశ పౌరులందరినీ సమానంగా పరిగణిస్తుందనీ సీఎం అన్నారు.

ప్రపంచ లిఖిత రాజ్యాంగాలలో భారత రాజ్యాంగానిది ప్రథమ స్థానం అని సీఎం ఆన్నారు. మనుషులందరూ సమానమనే విశ్వమానవ సమానత్వ సిద్దాంతాన్ని భారత రాజ్యాంగం ప్రతిఫలిస్తుందని సీఎం తెలిపారు. సమాఖ్య స్పూర్తిని బలోపేతం చేసే దిశగా, రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ అందించిన ఆర్టికల్ 3 ను అనుసరించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తితోనే పాలన కొనసాగిస్తున్నదని సీఎం అన్నారు. అంబేడ్కర్ మహాశయుని పేరును తెలంగాణ సచివాలయానికి నామకరణం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళి అర్పించిందన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version