అధికార ప్రతినిధులకు కెసిఆర్ స్ట్రాంగ్ వార్నింగ్, ప్రజలు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు…!

-

ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతుందని, ప్రజలు అందరూ ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణా నియంత్రణ లో అధికారులు అందరూ కనిపిస్తున్నారని, హైదరాబాద్ లో ఉన్న ప్రజా ప్రతినిధులు అందరూ ఎక్కడికి పోయారని కెసిఆర్ నిలదీశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని కెసిఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. రాష్ట్రంలో పోలీసులకు ప్రజలు సహకరించకపోతే 24 గంటలు కర్ఫ్యూ విధిస్తామని అన్నారు.

ఇలాంటి సమయాల్లోనే ప్రజలకు నాయకులు అందుబాటులో ఉండాలని కెసిఆర్ సూచించారు. ఏ ఊరి సర్పంచ్ ఆ ఊరి కథానాయకుడు కావాలని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మనం ఆస్తి అని ప్రజలు ఇప్పుడే మనం వచ్చామా లేదా అని చూస్తారని, కాబట్టి అందరూ వచ్చి చౌరస్తా లో నిలబడాలని సూచించారు. హైదరాబాద్ లో 150 మంది కార్పొరేటర్లు ఎక్కడికి పోయారని కెసిఆర్ ఈ సందర్భంగా నిలదీశారు.

ప్రజలకు అసౌకర్యం కలగకుండా అందరూ చూసుకోవాలని ఆయన కోరారు. 10 లక్షల మందికి పైగా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉన్నారని అన్నారు. రాష్ట్ర అవసరాల్లో నిత్యావసర సరుకుల కోసం ఒక రోజు టోల్ మినహాయింపు ఉంటుందని అన్నారు. ఎవరీ వ్యవసాయ ఉత్పత్తులు వారి ఊర్లో నే అమ్ముకోవాలని, ప్రజలు భయపడవద్దని అందరి వద్ద ప్రభుత్వమే కొంటుందని కెసిఆర్ ఈ సందర్భంగా కెసిఆర్ సూచించారు.

కూరగాయలు ధరలు పెంచితే మాత్రం పీడి యాక్ట్ పెట్టి జైల్లో పెడతామని అన్నారు. మొక్క జొన్న వరి పంట ప్రభుత్వమే కొంటుందని ఆయన అన్నారు. హోం క్వారంటైన్ లో ఉన్న వాళ్ళపై గట్టి నిఘా ఉంటుందని అవసరం అయితే వారి పాస్ పోర్ట్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇంకా నకరాలు చేస్తే మాత్రం పాస్ పోర్ట్ సస్పెండ్ చేస్తామని అన్నారు. రైతు బంధు సమితులు అన్నీ కూడా క్రియాశీలకం కావాలని అన్నారు.

ఇష్టం వచ్చినట్టు కూరగాయల ధరలు పెంచితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కెసిఆర్ అన్నారు. రైతు పంటలను తీసుకుని పట్టణ యార్డులకు రావొద్దని ఆయన హెచ్చరించారు. కనిపిస్తే కాల్చి వెత పరిస్థితి తెచ్చుకోవద్దని కెసిఆర్ హెచ్చరించారు. వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకం లేదని కెసిఆర్ స్పష్టం చేసారు.

తిండి గింజలు కావాలి కాబట్టి వ్యవసాయ పనులు జాగ్రత్తగా చూసుకోవాలని కెసిఆర్ సూచించారు. దయచేసి ప్రజలు అందరూ నియంత్రణ పాటించాలని సూచించారు. జనం ఆందోళన పడవద్దని కెసిఆర్ ఈ సందర్భంగా సూచించారు. దుకాణాలు అన్నీ కూడా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక నిమిషం తెరిచి ఉంచినా లైసెన్స్ రద్దు చేస్తామని కెసిఆర్ స్పష్టం చేసారు. ఇక నుంచి బ్రతిమిలాడే పరిస్థితి ఉండదని అన్నారు.

మంత్రులు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పని చెయ్యాలని ప్రతీ చెక్ పోస్ట్ వద్ద పోలీసులతో పాటుగా ప్రజాప్రతినిధులు అందరూ ఉండాలని అన్నారు. అత్యవసర సమస్యలు వస్తే 100 కి డయల్ చేయమని ఆయన సూచించారు. నిన్నటి వరకు పోలీసులు చాలా సున్నితంగా చెప్పారని ఇప్పుడు మాత్రం కఠినం గా ఉంటామని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు కూడా కొనసాగుతాయని లేబర్ ఉండే చోట మాత్రం శానిటేషన్ చెయ్యాలని ఆయన సూచించారు.

లేబర్ ఉండే చోట చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇతర రాష్ట్రం నుంచి మనకు వ్యాధి రాదని, దీన్ని ఇలాగే కొనసాగిస్తే మనం వ్యాధిని కట్టడి చేసుకోవచ్చని, లోకల్ గా వచ్చిన కేసులు ఏమీ లేవని ఆయన అన్నారు. ఇప్పటికే వచ్చిన వైరస్ ని మనం కట్టడి చెయ్యాలని కెసిఆర్ అన్నారు. వాహనదారులు ఆగకపోతే మాత్రం పెట్రోల్ బంక్ లు బంద్ చేస్తామని అన్నారు. మీడియా పట్ల పోలీసులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

మీడియా కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వాళ్ళను ఇబ్బంది పెడితే ప్రజలకు వార్తలు వెళ్ళే అవకాశం ఉండదని కాబట్టి మీడియా విషయంలో పోలీసులు అనవసరంగా హడావుడి చేయవద్దని ఆయన సూచించారు. డీజీపీ కి కూడా ఆదేశాలు ఇచ్చామని కెసిఆర్ అన్నారు. పోలీసులను ప్రజలను అర్ధం చేసుకోవాలని, పోలీసులకు స్వార్ధం ఉండదని కాబట్టి వాళ్లకు సహకరించాలని కెసిఆర్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version