హైదరాబాద్: మరియమ్మ లాకప్ డెత్‌పై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. విచారణ చేపట్టాలని డీజీపీకి ఆదేశించారు. నిజ నిర్దారణ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించాలని డీజీపీని ఆదేశించారు. ఎస్సీ మహిళ లాకప్‌డెత్ అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వం సహించబోదని సీఎం హెచ్చరించారు.
ఎస్సీల పట్ల సమాజ దృక్పథం మారాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఎస్సీలు, పేదల పట్ల పోలీసులు ఆలోచన ధోరణి మారాలన్నారు. ఎస్సీలపై చేయిపడితే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. ఎస్సీలకు అన్యాయం జరిగితే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.