డిప్రెషన్ తో బాధ పడే వాళ్లకు ఇటువంటి విషయాలు ఎప్పుడూ చెప్పద్దు. వీటి వల్ల వాళ్ళు మరి కాస్త డిస్ట్రబ్ అయిపోయే అవకాశం ఉంది. మానసికంగా వచ్చే సమస్యల్లో డిప్రెషన్ కూడా ఒకటి. డిప్రెషన్ తో బాధ పడే వాళ్ల ముందు ఈ విషయాలు అస్సలు మర్చిపోయి కూడా చెప్పొద్దు.
ఆనందంగా ఉండు:
ఇటువంటి సలహా ఇవ్వడం వల్ల వాళ్లలో ఇబ్బంది మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న కుదరడంలేదు అటువంటి సమయంలో మీరు ఆనందంగా ఉండాలి అని చెప్తే అది మరి కాస్త ఇబ్బంది పెడుతుంది.
ఈ సమస్య ఏమీ పెద్ద సమస్య కాదు:
డిప్రెషన్ తో బాధపడే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ సమస్య పెద్దది ఏమీ కాదు అన్న మాటలు చెప్పొద్దు. దీని వల్ల వల్ల సమస్య మరింత పెద్దదవుతుంది.
నీ కంటే కూడా చాలా మంది ఎక్కువగా ఇబ్బందుల్లో ఉన్నారు:
ఇది చిన్న సమస్య అని సమస్య వేరే వాళ్ళతో పోల్చుకుంటే పెద్దది కాదు అని చాలా మంది ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. ఇటువంటివి చెప్పడం వల్ల వాళ్లలో బాధ మరింత పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇటువంటివి చెప్పి వాళ్ళని బాధ పెట్టొద్దు.
నువ్వు చేసుకున్నదే:
ఈ సమస్య రావడానికి కారణం నువ్వు చేసుకున్నదే అని వాళ్ళ పైన ఆరోపణలు వేయొద్దు. ఇలా ఈ విషయాలు వాళ్లతో చెప్పడం వల్ల వాళ్లలో ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటుంది తప్ప.. ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి డిప్రెషన్ తో బాధపడే వాళ్ళకి ఎప్పుడూ ఇటువంటివి చెప్పవద్దు.