గత నెలన్నర రోజులుగా దేశంలో సంచలనం రేపుతున్న విషయాలలో ఒకటి వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్. ఈ బిల్లును ఈ నెలలో జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో తీసుకువచ్చి నెగ్గాలన్నది మోదీ మాస్టర్ ప్లాన్. కానీ ఎన్నికలు జరగడం చాలా పార్టీలకు ఇష్టం లేదని కామెంట్ చేస్తున్నారు. కాగా తాజాగా ఈ జమిలీ ఎన్నికలపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు.. ఇక రీసెంట్ గా జరిగిన BRS పార్లమెంటరీ మీటింగ్ లో ఈ జమిలి ఎన్నికల గురించి సీఎం కేసీఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు జమిలి ఎన్నికల వలన ప్రత్యేకంగా మాకు ఏమీ నష్టం లేకపోగా, లాభమే అన్న విధంగా కేసీఆర్ చెప్పడం ఆలోచనలకూ దారితీస్తోంది. ఇప్పుడు దేశంలో చాలా పార్టీలు జమిలి ఎన్నికలపై వ్యతిరేకత చూపుతున్న నేపథ్యంలో కేసీఆర్ కామెంట్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
మరి ఈ నెల 18వ తేదీన జరగనున్న ప్రత్యేక సమావేశాలలో ఈ బిల్లును తీసుకువస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది.