కాంగ్రెస్ పార్టీ 58 పరిపాలించింది. కానీ తెలంగాణను కష్టాల పాలు చేసింది. కాంగ్రెస్ దోఖాబాజీ పార్టీ అని తెలిపారు కేసీఆర్. ఏ గ్రౌండ్ లో అయితే తెలంగాణ తొలిసభ పెట్టామో.. అదే గ్రౌండ్ లో అభివృద్ధి గురించి చెబుతున్నానని తెలిపారు కేసీఆర్. ఎన్నో సంక్షేమ పథకాలను కరీంనగర్ గడ్డ పై నుంచి చెప్పానని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అని స్పష్టం చేశారు కేసీఆర్.
ఓటు వేసేటప్పుడు రాయి ఏదో, రత్నం ఏదో గుర్తించి ఓటు వేయాలని సూచించారు. నాడు బీఆర్ఎస్ ను చీల్చే ప్రయత్నం చేశారు. కేసీఆర్ కిట్, ఒమ్మఒడి వాహనాలు.. వైద్య వసతులను పెంచామని తెలిపారు. తలసరి ఆదాయంలో తెలంగాణలో అగ్రస్థానం ఉంది. రైతులు బాగుండాలని చెప్పి.. నీటి తీరువా బకాయిలు రద్దు చేశాం. ఉచితంగా విద్యుత్ ను 24 గంటలు ఇస్తున్నామని తెలిపారు. రైతులకు సహాయం అందజేస్తున్నాం. రైతుబంధు, రైతుబీమా, ధరణీ పోర్టల్ వంటివి తీసుకొచ్చాం. ధరణీతో దళారులకు ఆస్కారం లేకుండా పోయింది.