నాడు గతుకుల గజ్వేల్ నేడు బతుకుల గజ్వేల్ అయింది : మంత్రి హరీశ్ రావు

-

రైతుల సంక్షేమం గురించి ఆలోచించేది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర మంత్రి హారిశ్‌రావు పునరుద్ఘాటించారు. నాడు గతుకుల గజ్వేల్‌….నేడు బతుకుల గజ్వేల‌్‌గా మారిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 3 గంటల కరెంట్ కావాలా.. మోటారుకు మీటరు పెట్టె బీజేపీ కావాలా…అన్ని విధాల  ఆదుకున్న బీఆర్ఎస్ కావాలో…ప్రజలే  ఆలోచించుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్‌లో నిర్వహించిన రోడ్‌ షో మంత్రి హారిశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్‌ నేతలు వన్‌ ఛాన్స్‌ అని వస్తారని.. అధికారంలోకి వచ్చాక ఎక్స్‌క్యూజ్‌మీ ప్లీజ్‌ అంటారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మళ్లీ కేసీఆర్‌కే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్​కు ఛాన్స్ ఇచ్చిన కర్ణాటక ప్రజలు ఇప్పుడు నరకం అనుభవిస్తున్నారని అన్నారు. ఆ రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోనే 350 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారంటే అక్కడి దుస్థితి అర్థం చేసుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నక్క వినయాన్ని నమ్మి ప్రజలు మోసపోవద్దని హరీశ్ రావు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version