సర్జికల్ స్ట్రైయిక్స్ పై ఫ్రూవ్ లు నేను అడుగుతున్నా.. రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో తప్పేంటి- సీఎం కేసీఆర్

-

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేం ఉంది.. ఇప్పుడు నేను కూడా సర్జికల్ స్టైయిక్స్ ఫ్రూప్స్ అడుగుతున్నానని.. బీజేబీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. దీనిపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని.. బీజేపీ అబద్ధాలు చెబుతుందని అంతా అనుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారని.. దీనిపై ఫ్రూప్స్ అడిగితే తప్పేం ఉందని ఆయన అన్నారు. అస్సాం సీఎం రాహుల్ గాంధీని అవమానపరచడాన్ని ఆయన ఖండిస్తున్నా అని కేసీఆర్ అన్నారు. ఇండియన్ ఆర్మీ చేసిన సర్జికల్ స్టైయిక్స్ పై భారత దేశంలో సగం మందికి అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇది కేవలం పోలిటికల్ స్టంట్ మాత్రమే అన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా సరిహద్దుల్లో ఘర్షలకు పెద్దదిగా చూపిస్తున్నారంటూ.. బీజేపీని విమర్శించారు. బీజేపీకి ఇది అవాటైందని అన్నారు. హరీష్ రావత్ చనిపోతే.. బీజేపీ జెండాలు పెట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ పార్టీ సర్జికల్ స్ట్రైయిక్స్ ని పొలిటికల్ ఎజెండాగా ఉపయోగించుకుంటుందని అన్నారు. సర్జికల్ స్టైయిక్స్ జరిగితే ఆ క్రెడిట్ ఆర్మీకి వెళ్లాలని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version