ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లపై కాల్పులు జరిపిన మావోయిస్టులు

-

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. జీడిపల్లి నూతన క్యాంపు నుంచి ధర్మారం క్యాంపునకు వెళుతున్న జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన జవాన్లు మావోయిస్టులకు ధీటుగా సమాధానం ఇచ్చారు.

ఇదిలాఉండగా, మావోయిస్టుల కాల్పులు, ఎదురుకాల్పులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు రివీల్ చేయలేదు. కాకపోతే మావోయిస్టుల కోసం జవాన్లు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎదురుకాల్పలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version