కాంగ్రెస్ లో ముసలం.. బోరున ఏడ్చేసిన విహెచ్!

-

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మ‌రో సారి ముస‌లం. పార్టీ నాయకుల మ‌ధ్య వివాదాలు మ‌రోసారి బ‌య‌ట ప‌డ్డాయి. కాంగ్రెస్ పార్టీ త‌ప్పుల‌ను ఎత్తి చూపే వీ హ‌న్మంత రావు ఈ సారి ఏకంగా బోరున ఏడ్చారు. కాంగ్రెస్ పార్టీ కోసం తాను ఎంతో క‌ష్ట ప‌డ్డానని అన్నారు. కానీ త‌గిన గుర్తింపు ఉండ‌టం లేద‌ని అన్నారు. అలాగే తెల‌గాణ కాంగ్రెస్ పార్టీలో బీసీల‌కు గుర్తింపు లేద‌ని అన్నారు. పార్టీ నాయకులు ఒంటెద్దు పోక‌డ‌లతో పోతున్నార‌ని విమ‌ర్శించారు.

దీంతో త‌న లాంటి సీనియ‌ర్లుకు అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆవేద‌న‌తో వీ హ‌న్మంత రావు బోరున ఏడ్చేశారు. అన్యాయంపై దీనిపై ఫిర్యాదు చేసినా.. లాభం ఉండ‌టం లేద‌ని అన్నారు. కాగ ఈ రోజు గాంధీ భ‌వ‌న్ లో మాణిక్కం ఠాకూర్ ఆధ్వ‌ర్యంలో పీఏసీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి సీనియ‌ర్లు డుమ్మా కొట్టారు. ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి తోపాటు, రాజ న‌ర్సింహ‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, బ‌ట్టి విక్ర‌మార్క గైర్హ‌జ‌రు అయ్యారు. కాగ స‌మావేశంలో ఎంపీ కోమ‌టి రెడ్డి తీరుపై ప‌లువురు నేత‌లు తీవ్ర అసంతృఫ్తి వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాల‌ని మాణిక్కం ఠాకూర్ కు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version