మునుగోడులో కేసీఆర్ ప్రచారానికి ముహూర్తం ఫిక్స్.. ఈనెల 30న చండూరులో సభ

-

దిల్లీ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక మునుగోడు ఉపఎన్నికపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు నియోజకవర్గంలో కేసీఆర్ ప్రచారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 30న కేసీఆర్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారం షురూ చేయనున్నారు. ముందుగా చండూరులో నిర్వహించే టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.

కేసీఆర్ ప్రచారానికి ముహూర్తం ఫిక్స్ కావడంతో గత కొన్నిరోజులుగా ఉన్న కన్ఫ్యూజన్ కి తెరపడింది. తొమ్మిది రోజుల దిల్లీ పర్యటన ముగించుకున్న కేసీఆర్ ఇవాళ హైదరాబాద్ చేరుకుని ముందుగా మునుగోడు ఉపఎన్నికపై సమీక్ష చేయనున్నారు. గురువారం నుంచి మునుగోడు ఉపఎన్నికపై కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

బహిరంగ సభ నిర్వహణ, ప్రచారపర్వం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నిర్వహించనున్న సమీక్షలో నేతలతో చర్చించనున్నారు. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో సీఎంవో అధికారులు పర్యటిస్తున్నారు. కేసీఆర్ బసకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. వారం పాటు మునుగోడులోనే ఉండి కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం చండూరు, చౌటుప్పల్, మునుగోడు ప్రాంతాల్లో కేసీఆర్ బస చేసేందుకు అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయినట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version