తెలంగాణ ప్రభుత్వం ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసించి ఇటీవల యుద్ధనేపథ్యంలో ఇండియాకు వచ్చిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉక్రెయిన్ మెడిసిన్ విద్యార్థుల ఖర్చు భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ విద్యార్థుల పట్ల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంత ఖర్చైనా వారిని మెడిసిన్ చదివిస్తామని.. డాక్టర్లుగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ సభలో వెల్లడించారు. 20 వేల పైగా పిల్లలు ఉక్రెయిన్ లో భారతీయ పిల్లలు చిక్కుకుపోయారని.. అక్కడ వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లారని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… ఉక్రెయిన్ విద్యార్థుల ఖర్చు భరిస్తామని వెల్లడి
-